- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానకొండూరులో బీఎస్పీ గద్దె కూల్చివేత.. ఆర్ఎస్పీ సీరియస్
దిశ, మానకొండూరు: ఓ వైపున బహుజన యాత్ర నిర్వహిస్తుండగానే మరోవైపున ఆ పార్టీ జెండా గద్దెలు ధ్వంసం అవుతున్నాయి. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఊరూరా తిరుగుతూ ప్రచారం చేపట్టిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా బీఎస్పీ జెండా గద్దె కూల్చివేయడంపై బీఎస్పీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మానకొండూరు నియోజకవర్గంలో తోటపల్లి, కన్నాపూర్ గ్రామాల్లో కూడా బీఎస్పీ జెండా గద్దెలను కూల్చారని తాజాగా మానకొండూరులో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అయిందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. బీఎస్పీ గద్దెను తొలగించడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కూల్చివేత ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా గద్దెల కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేపట్టేందుకు బీఎస్పీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.
Also Read...