ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనికి వెళ్లే ఆటో బోల్తా

by samatah |
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనికి వెళ్లే ఆటో బోల్తా
X

దిశ, రామడుగు : ఉదయాన్నే లేచి కరీంనగర్ వెళ్లి కూలీ పని చేసుకునే వారికి ఒక్కసారిగా పరలోకాలకు వెళ్లినంత పని అయింది. స్థానికుల వివరాల ప్రకారం రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన నారాయణ ఆటో ప్రయాణికులను ఎక్కించుకొని కరీంనగర్ వెళుతుండగా దేశరాజు పల్లె వద్ద వెనకాల వస్తున్న లారీ ఓవర్టేక్ చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా లారీ టైరు ఊడిపోయి ఎగిరి వచ్చి అమాంతం ఆటో ముందు భాగంలో బలంగా పడేసరికి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పెద్ద ప్రమాదం జరిగిందని గమనించిన లారీ డ్రైవర్ లారీ తో సహా పరారయ్యారు. లారీ నెంబర్ MH 27 BH 3586 గా స్థానికులు గుర్తించారు.

Advertisement

Next Story