- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

దిశ,గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ ధర్నా నిర్వహించనున్నారు. ఈనెల 20న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్, ఇంద్ర పార్క్ వద్ద మహా ధర్నా ను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. సింగరేణి RG.1.డివిజన్ 2A గని వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీల అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికులకు ఇంటి పథకం అలాగే 20 లక్షల వడ్డీ లేని రుణం, సింగరేణి పరిరక్షణ, కొత్త భూగర్భ గనులు, కోల్ బ్లాకులు సింగరేణికి ఇవ్వాలని, వన్ టైం సెటిల్మెంట్ క్రింద మానవతా దృక్పథంతో డిపెండెంట్ కార్మికుల మారు పేర్లను సవరించి వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగం లోకి తీసుకోవాలని, సర్ఫేస్ లో ఖాళీలను పూర్తి చేయాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూన్నారు. ఈనెల 20న జరిగే చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద జరిగే మహా ధర్నా లో అధిక సంఖ్యలో కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టి యు నాయకులు ఈ నరేష్, జి మల్లేశం, ఈ రామకృష్ణ, శ్రీకాంత్, ప్రసాద్, ఎం దుర్గయ్య, ఎం కొమురయ్య, రవికుమార్,తదితరులు పాల్గొన్నారు.