- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP : ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి.. ఒంటెల కరుణాకర్ రెడ్డి..
దిశ, రామడుగు : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే చేపట్టాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తుండగా మరోవైపు ఇప్పటి వరకు కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలే ప్రారంభించని పరిస్థితి దాపురించిందని అన్నారు.
అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టకపోవడం రైతులను ఇబ్బందుల గురిచేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం గద్దనెక్కకముందు రైతులకు 500 బోనస్ తో వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు సన్న రకానికి మాత్రమే ఇస్తామనడం సరికాదన్నారు. అసలే శీతాకాలం దాంట్లో తేమశాతాన్ని సాకు చూపిస్తూ రైతులకు కొర్రెలు పెట్టడం సరికాదని, అన్ని రకాల వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మోడీ రవీందర్, పోచంపల్లి నరేష్, ఎడవల్లి రామ్ లక్ష్మణ్, కారుపాకల అంజిబాబు, మూల వంశీ తదితరులు పాల్గొన్నారు.