- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌ను ఓడించి.. సిరిసిల్ల గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తా: Rani Rudrama Reddy
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల బీజేపీలో గ్రూపులు వీడండి.. గతం గతహా.. ఇప్పటి నుంచి కష్టపడి పార్టీ కోసం పని చేయండి.. నెలకు నేను పది నుంచి ఇరవై రోజులు సిరిసిల్లలోనే ఉంటా.. సిరిసిల్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయాలి.. అబ్బా సిరిసిల్లలో కేటీఆర్ ఉన్నాడు అని కాదు వాళ్ల నాయిన కేసీఆర్ నిలబడ్డా మేం ఓడగోడుతాం అన్న ధీమాతో ప్రతి బీజేపీ కార్యకర్త పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సిరిసిల్ల నియోకవర్గ బీజేపీ పాలక్ రాణి రుద్రమ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూర్ సమీపంలో బీజేపీ సిరిసిల్ల నియోజకవర్గం బూత్ లెవల్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించగా..ముఖ్య అతిథిగా రాణి రుద్రమ హాజరయ్యారు. సిరిసిల్ల బీజేపీ పార్టీలో ఉన్న గ్రూపులు వీడండని, సిరిసిల్లలో బీజేపీని గెలిపించుకోవడానికి ఒక్కో కార్యకర్త వంద మందితో సమానంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ అని భయపడవద్దన్నారు. దేశంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని పేర్కోన్నారు.
సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులపై బీజేపీ అభ్యర్థులు హోరాహోరీ కోట్లాడారని, అయినా బీఆర్ఎస్ డబ్బాలు మార్చి..ఆరు నుంచి 7 స్థానాలు గెలిచే బీజేపీ స్థానాల్లో సైతం అధికారులను, ఎన్నికల సిబ్బందిపై ఒత్తిళ్లు చేసి తామే గెలిచామని ప్రకటించుకున్నరన్నారు. సిరిసిల్లలో అధికార బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా, కేసులు పెడుతున్నా బెదరమని అన్నారు. తెలంగాణా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు సిరిసిల్లలో చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదుర్కోన్న కార్యకర్తలు సిరిసిల్లో ఉన్నారన్నారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్తలపై ఈగ వాలనివ్వమన్నారు. ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని, సిరిసిల్ల గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడమే ముందున్న లక్ష్యమని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సిరిసిల్ల నియోజకవర్గ పాలక్ గా నియమించి నెలకు 4 సార్లు వెళ్లిరమన్నారన్నారు. కానీ సమయం దొరికినప్పుడల్ల సిరిసిల్లకు వస్తానని, నెలకు 10నుంచి 20 రోజులు సిరిసిల్లలోనే ఉండి బీజేపీ కోసం పని చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతం కావాలన్నారు. బూత్ కమిటీలలలో కనీసం 30 శాతం మహిళలు ఉండేలా చూసుకోవాలన్నారు. సిరిసిల్ల నియోజవర్గం నుంచి బీజేపీ కార్యకర్తలు ఏ సమస్య వచ్చినా.. తనకు ఫోన్ చేస్తే స్పందిస్తానన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.
తెలంగాణాలో ఎన్నికలు మరో పది నెలలు మాత్రమే ఉన్నాయని, ఇంతలోనే బీజేపీ కార్యకర్తలు, క్యాడర్ మొత్తం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించబడుతది కావొచ్చు.. కేటీఆర్ ను ఓడగొడుతాం కావొచ్చు అంటూ రాణి రుద్రమ పేర్కొన్నారు. రేపు ఒక్కో కార్యకర్త వంద ఓట్లు బీజేపీకి వేయించే శక్తిగా తయారు కావాలని రాణి రుద్రమ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, బీజేపీ జిల్లా ఇన్చార్జీ మోహన్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, మహిళ అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ, సిరిసిల్ల పట్టణధ్యక్షులు అన్నల్దాస్ వేణు తదితరులు పాల్గొన్నారు.