రాజేశ్వరరావు ఆదర్శప్రాయుడు..మంత్రి కొప్పుల ఈశ్వర్

by Sumithra |   ( Updated:2023-08-31 09:58:42.0  )
రాజేశ్వరరావు ఆదర్శప్రాయుడు..మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, వేములవాడ : స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దివంగత నేత, చెన్నమనేని రాజేశ్వర్ రావు ప్రజాసమస్యల పరిష్కారంలో పోరాడిన గొప్పనాయకుడు నేటి యువతరానికి ఆయన ఆదర్శప్రాయుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంగీత నిలయంలో రాజేశ్వరరావు శతజయంతి వేడుకలను గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు నాయకుడిగా మేధావిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని, రాజకీయ అనుభవము గొప్ప మేధావిగా ఉన్న ఆయన అనేక సమస్యలపై ప్రత్యక్ష, పరోక్ష పోరాటం కూడా చేశారన్నారు. ఆయన చేసిన పోరాటాలు ఈ ప్రాంత ప్రజల్లోఎంతో చైతన్యాన్ని కూడా నింపాయి నాటి తరం నుండి నేటి వరకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు కూడా దక్కింది అని వారి జ్ఞాపకాలు రాష్ట్రచరిత్ర ఉన్నంత వరకు ఉంటాయి అన్నారు.

ఉన్నత సామాజిక వర్గంలో జన్మించిన రాజేశ్వరరావు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాలు, గడిపిన జైలు జీవితాలు ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్రంలో నాటి పరిస్థితులు వేరని అప్పటి కమ్యూనిస్టులను అప్పటి ప్రభుత్వాలు వ్యతిరేకించిన తీరు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసిన పోరాటాలు చిరస్థాయిగా గుర్తుంటాయి అన్నారు. చెన్నమనేని కుటుంబం చాలా గొప్పదనీ రాజేశ్వరరావు చిత్రప్రదర్శన చూస్తే తనే మరోసారి కళ్ళ ముందు ఉన్నట్లు అనిపిస్తుందని గుర్తు చేశారు. రమేష్ బాబు జర్మనీలో ప్రొఫెసర్ గా ఉండి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఆయన సేవలు ఎంతగానో ఈ ప్రజలకు అందడం పట్ల ఈశ్వర్ ఎమ్మెల్యేను అభినందించారు.

Advertisement

Next Story