బండి విడుదల.. కరీంనగర్‌లో సంబురాలు,ఆలయంలో ప్రత్యేక పూజలు

by samatah |
బండి విడుదల.. కరీంనగర్‌లో సంబురాలు,ఆలయంలో ప్రత్యేక పూజలు
X

పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో అరెస్టై కరీంనగర్​ జైలులో ఉన్న బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. కాగా, ఈ కేసులో హనుమకొండ జిల్లా కోర్టు గురువారం రాత్రి బెయిల్​ మంజూరు చేసిన విషయం విధితమే. దీంతో శుక్రవారం ఉదయం బీజేపీ నాయకులు, లీగల్​ సెల్​ సభ్యులు కరీంనగర్​ జైలుకు చేరుకొని అధికారులకు బెయిల్​ పత్రాలను అందజేయడంతో ఉదయం 9గంటలకు సంజయ్ విడుదలయ్యారు. తొలుత కరీంనగర్​లోని శక్తిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనను బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్గ్​ కరీంనగర్​ చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో కేసీఆర్​ ప్రభుత్వం అవలభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు కేసీఆర్​ కుటుంబం చేస్తున్న అవినీతిపై నిప్పులు చెరిగారు.

దిశ, కరీంనగర్​ బ్యూరో : పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో అరెస్టై కరీంనగర్​ జైలులో ఉన్న బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్గ్​ కరీంనగర్​ చేరుకుని పరామర్శించారు. అనంతరం సంజయ్​ అత్తమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైయ్యారు. జైలు నుంచి విడుదలైన సంజయ్​ తొలుత కరీంనగర్​లోని శక్తిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

9గంటలకు విడుదల..

పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసులో అరెస్టైన బండి సంజయ్​ కుమార్​ శుక్రవారం కరీంనగర్​ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ కేసులో హనుమకొండ జిల్లా కోర్టు గురువారం రాత్రి బెయిల్​ మంజూరు చేయగా శుక్రవారం ఉదయం బీజేపీ నాయకులు, లీగల్​ సెల్​ సభ్యులు కరీంనగర్​ జైలు వద్దకు చేరుకొని జైలు అధికారులకు బెయిల్​ పత్రాలను అందజేశారు. ఉదయం 9గంటలకు బయటికి వచ్చిన సంజయ్​ ముందుగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో కేసీఆర్​ ప్రభుత్వం అవలభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు కేసీఆర్​ కుటుంబం చేస్తున్న అవినీతిపై నిప్పులు చెరిగారు.

పట్టణంలో 144వ సెక్షన్​ విధింపు..

బండి సంజయ్​ కరీంనగర్​ జైలు నుంచి విడుదల అవుతున్న సందర్భంగా కరీంనగర్ జైలు పరిసర ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి ఐబీ చౌరస్తా, గ్రేవ్ యార్డ్, జైలు పరిసర ప్రాంతాలు, వెంకటేశ్వర టెంపుల్ ప్రాంతాల్లో 144సెక్షన్ విధించారు. జైలు పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. పట్టణంలోని ట్రాఫిక్​ ఆంక్షాలు విధించి జైలు మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లీంచారు. సంజయ్​ జైలు నుంచి విడుదలైన కొద్ది సేపటి తరువాత ట్రాఫిక్​ను పునరుద్దరించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు..

కరీంనగర్​ జైలు నుంచి విడుదలైన సంజయ్​ పట్టణంలోని మహశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సంజయ్​ అత్తగారి ఇంటికి చేరుకొని ఇటీవల మరణించిన అత్తమ్మ దిశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి అంబేద్కర్​ చౌరస్తాకు చేరుకుని అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంజయ్​ జైలు నుంచి విడుదలైన విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంబేద్కర్​ విగ్రహాం నుంచి రేకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

సంజయ్​కు తరుణ్ చుగ్ పరామర్శ..

పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో అరెస్టైన సంజయ్​ను తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జీ తరుణ్​ చుగ్​తోపాటు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ రాంచందర్​ రావు, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, జయశ్రీ, ఉమారాణి, శ్రీనివాస్​ గౌడ్​ తదితరులు బండి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో బండి సంజయ్​తో కలిసి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed