భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి

by Sridhar Babu |   ( Updated:2024-12-03 14:52:14.0  )
భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి
X

దిశ, జగిత్యాల్ టౌన్ : బాధిత మహిళలకు, చిన్నపిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించాలని భరోసా సెంటర్లకు సూచించారు. అలాగే ఫోక్సో, అత్యాచారానికి గురైన బాధితులకు భరోసా సెంటర్ లోని సంబంధిత అధికారులు వారికి తగిన సలహాలు, సూచనల అందించాలని భరోసా సిబ్బందికి సూచించారు. భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ రంజిత్ రెడ్డి, భరోసా సెంటర్ సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed