- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన పడొద్దు : బోయినపల్లి వినోద్ కుమార్
దిశ, కరీంనగర్ టౌన్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం టీఆర్టీఎఫ్ ప్రతినిధి బృందం కరీంనగర్‌లో ఆయనను కలిసి ప్రభుత్వం బదిలీలు పదోన్నతులకు పచ్చ జెండా ఊపిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ 317 జీవో బాధితులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని, 13 జిల్లాల స్పౌజ్ కేసుల విషయంలో, మిస్సింగ్ స్పౌజ్ విషయంలో వారికి న్యాయం చేయాలని, పండిత పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్, పీఎస్ హెచ్ఎం పోస్టుల మంజూరి వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
వీటిపై బోయినపల్లి వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన పడొద్దని.. సమస్యలు ప్రభుత్వ దృష్టి లో ఉన్నాయని, న్యాయపర సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని, అందరికీ న్యాయం చేద్దామన్నారు. అనంతరం వినోద్ కుమార్ కి సంఘ డైరీ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాల అధ్యక్షులు సింగిశీల ప్రభాకర్ రావు, నందికొండ విద్యాసాగర్, తుంగూరి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ అశోక్ రావు, కూర రమేష్, జిల్లా బాధ్యులు హాయ్ లతీఫ్, రమణారావు, భాను ప్రకాష్, మోహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.