- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బుద్ధుడు నడయాడిన నేల పాషిగాం : ప్రొఫెసర్ కోదండరాం
చారిత్రక ప్రదేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత
దిశ, వెల్గటూర్: బుద్ధుడు ఆయన శిష్యుడు పాషయ్ నడయాడిన పవిత్ర స్థలం పాషిగాం, అంతే కాకుండా ఈ పరిసరాల్లో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల చారిత్రక అవశేషాలు, పవిత్ర గోదావరి, ప్రాచీనా శివాలయం ఉందని.. ఇలాంటి గొప్ప చారిత్రక వారసత్వ సంపద కలిగిన ప్రదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరాం అన్నారు.
వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామానికి సోమవారం ఆయన విచ్చేసి ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్థులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపి కోదండరాం అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వమే పురావస్తు శాఖ ద్వారా తవ్వకాలు జరిపి చారిత్రక ప్రదేశాలను రక్షించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నారు. అలా కాకుండా చారిత్రక వారసత్వ సంపద ఉన్న ప్రదేశాన్ని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించి సమూలంగా నాశనం చేసే చర్యలకు దిగడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
రాష్ట్ర రహదారిని నిర్మించే సమయంలో పాషిగాం సమీపంలో ఉన్న పురాతన బౌద్ధ స్థూపాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. చారిత్రక ప్రదేశంగా గుర్తించి బౌద్ధ స్తూపం నిర్మించాలని డిమాండ్ ఎన్నో రోజులుగా వినిపిస్తుందన్నారు. ఇలాంటి చారిత్రక ప్రదేశంలో ప్రజల ప్రాణాలను హరించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తూ చారిత్రక వారసత్వ సంపదకు తూట్లు పొడవడం సరైంది కాదన్నారు. కాలుష్య కారకమైన పరిశ్రమను జనావాసాల మధ్య నిర్మించి ప్రజల ప్రాణాలు తీస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇథనాల్ పరిశ్రమ ఇక్కడి నుంచి తీసేలా చేయాలంటూ ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం తమ నోరు నొక్కి కేసులు పెట్టి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ప్రజలు కోదండరాంకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలు తీసే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దని, పోలీసు నిర్బంధాలు వద్దని.. తక్షణమే సమస్యను కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకువెళ్తామని అయన ప్రజలకు భరోసానిచ్చారు. ఇతనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసే వరకు ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తామని కోదండరాం ప్రకటించారు. అనంతరం ప్రజలతో కలిసి ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశాన్ని బౌద్ధ స్తూపం ప్రదేశాలను కాలినడకన పర్యటించారు.