సీనియర్ సిటిజన్ కేసుల పర్యవేక్షణకు ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభం : ఆర్డీవో వీరబ్రహ్మచారి

by Shiva |   ( Updated:2023-05-17 09:19:54.0  )
సీనియర్ సిటిజన్ కేసుల పర్యవేక్షణకు ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభం : ఆర్డీవో వీరబ్రహ్మచారి
X

దిశ, మంథని : సీనియర్ సిటిజన్ కేసుల పర్యవేక్షణకు ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించామని మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కే.వీరబ్రహ్మచారి తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సీనియర్ సిటిజన్ ఆన్ లైన్ పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్, తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల నిర్వహణ సంక్షేమ చట్టం-2007, సంబంధిత రాష్ట్ర నియామకాల ప్రకారం మెయింటెనెన్స్ కేసులను ఫైల్ చేసే ప్రక్రియ అవాంతరాలు లేకుండా పారదర్శకంగా ఉండేలా https://tsseniorcitizens.cgg.gov.in పోర్టల్ ను రూపొందింనట్లు ఆయన తెలిపారు.

నిరాదరణకు గురైన తల్లిదండ్రులు వయవృద్ధుల పోషణ సంరక్షణ చూసుకొని పిల్లలపై ఆన్ లైన్ లో సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టులో ఫిర్యాదు చేయాలని, వయోవృద్ధులు మొబైల్ ఫోన్ ద్వారా గానీ, ఇతర ఆన్ లైన్ కేంద్రాల ద్వారా గాని పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డీఏవో రవీందర్, సీనియర్ అసిస్టెంట్ నవీన్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Also Read..

దాచేపల్లి మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన సీఎం KCR

Advertisement

Next Story