- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కని ఆఫీస్ లేదు.. మొక్కని అధికారి లేడు..!
దిశ, సైదాపూర్ : తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కని కొండలేదు.. మొక్కని బండలేదు.. అనే సామెతను ఓ వృద్దుడు తిరగేస్తూ ఆసరా పెన్షన్ కోసం నేను ఎక్కని ఆఫీస్ లేదు.. మొక్కని అధికారి లేడనీ తనగోడును వెళ్లగక్కారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన బండి కొమురయ్య (63) అనే గత రెండేళ్లుగా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకోగా తేది 12-08-2022 రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ ప్రోసెసింగ్ లను మంజూరైన లబ్దిదారులకు అందజేశారు.
అందులో భాగంగా బండి కొమురయ్యకు ప్రోసెసింగ్ అందించే ఫోటోతో అన్నిమీడియాల్లో వార్తలొచ్చాయి. కాని అర్హత లేని కొందరి వ్యక్తులకు నెలానెలా పెన్షన్ వస్తుంది. కాని బండి కొమురయ్యకు ప్రోసెసింగ్ ఇచ్చారు. కాని గత పదినెలలుగా పెన్షన్ రావటం లేదని వృద్దుడు ఆవేదన చెందుతున్నాడు. గత పది నెలలుగా మండల పరిషత్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్, ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా పెన్షన్ రావటంలేదని ఆందోళన చెందుతున్నాడు. అధికారులను, ప్రజాప్రతినిధులను పెన్షన్ రావటం లేదని పలుమార్లు తనగోడు వెళ్లబోసుకున్నా ఎవరు పట్టించుకునే నాధులే లేరంటున్నాడు. తట్టలు, బుట్టలు అల్లి కుటుంబాన్ని పోషిస్తూ వెళ్లదీస్తున్నాడు. ఇప్పటీకైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి కడు నిరుపేద వృద్ధునికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.