- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలం.. నష్టం అంచనాలో అధికారులు
దిశ, పెద్దపల్లి: గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్జిల్లా అతలాకుతలం అవుతోంది. అకాల వర్షాలకు తోడు వడగళ్ల వర్షానికి పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి తో పాటు కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు అంచనా వేస్తుండగా అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను నేతలు పరామర్శిస్తూ ఓదార్చుతున్నారు.
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల రూపంలో కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నకు తోడుగా మామిడి పంట సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యవసాయాధికారులతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు.
మండల స్థాయి అధికారుల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు పంట నష్టం అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జగిత్యాల జిల్లాలో 4,606 ఎకరాల్లో మామిడి, 432 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. పెద్దపల్లి జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 4,300 ఎకరాల్లో వరి, 1,778 మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మామిడి పంట సైతం దెబ్బతిన్నాయని అంచనా వేశారు.
నేతల పరామర్శలు
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికార. ప్రతిపక్ష పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించారు. వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.