- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుండి ఓదెల 'మల్లన్న' జాతర ప్రారంభం
దిశ, ఓదెల: తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర శోభకృత్ నామ సంవత్సరం బుధవారం రోజున ప్రారంభం కానుంది. ఈ జాతర ఉగాది పర్వదినాన ప్రారంభమై అన్ని దేవాలయాల జాతరలు ఉగాది తో పూర్తయితే ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో మాత్రం ఉగాది నుంచి జాతర ప్రారంభమై దాదాపు ఐదు నెలల పాటు కొనసాగుతుంది. ఈ జాతర ప్రతి బుధ ,ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఒక స్థానం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , ఛతీస్‌ఘడ్ నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తన్మయత్వం పొందుతారు.
ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ ఓదెల 'మల్లన్న' జాతర ఉగాది పర్వదినాన మొదలుకొని ఐదు నెలల పాటు నిరాటంకంగా సాగుతుంది. జాతరకు హాజరయ్యే భక్తులు గజ్జల లాగులను ధరించి ఓదెల మల్లన్న దండాలో... మమ్మేలు మా స్వామి దండాలో... ఆలుమిలా తారడో బోలుమియా గారడో అంటూ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పు అయినా మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తి పారవశ్యంతో వెళ్తుంటారు. భక్తి చేస్తూ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ముక్కులను చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తజన సందోహం జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకోని పట్నం వేయడం ఒగ్గు పూజారుల చేతిలో డమరుకాన్ని మోగిస్తూ శృతిని తలుస్తూ మొక్కులు స్వామివారికి భక్తులు చెల్లించుకుంటారు.
మండపంలో పూనకాలతో శివసత్తులు గజ్జల లాగులు అల్లిన దుస్తులను ధరించి శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. వచ్చే భక్తులలో చాలా మంది సంతానం గురించి మొక్కుబడి "టెంకాయ బంధనం" కట్టి వారికి సంతానం కలిగిన తరువాత మొక్కుబడి స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు." గండాలు తీరితే గండ దీపం పెడతాం కోరికలు తీరితే కోడెను కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, పిల్లజేల్ల సల్లంగా ఉంటే సేవలు చేస్తాం" అని మొక్కుకుంటారు. సంతానం, వ్యాధి బారిన పడిన వారికి ఆరోగ్యాలు, కష్టాలు వచ్చిన వారికి కష్టాలు తొలగిస్తూ, సకల భోగభాగ్యాలను ఇస్తారన్న నమ్మకం పరవశంతో గజ్జలతో కుట్టిన లాగులతో పూసలు కట్టిన అంగీలు, పూసల కుల్లాయి సన్నని జాలి చెద్దరు, చేతిలో త్రిశూలం దానికి చిరు గంట మరో చేతిలో కొరడా (వీర కోల) వంటివి ధరించి భక్తి తన్మ యత్వంతో సర్వం మల్లన్న తపిస్తాడనే ( శివం )పూనకాలతో ఊగుతూ గంతులు వేస్తూ తమ భక్తి చాటుకునేలా ప్రదక్షిణ చేస్తారు.
మల్లన్న సన్నిధిలో నిత్యం ఒగ్గు పూజారులు తప్పనిసరిగా స్వామి వారికి సేవలు చేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా స్వామి వారి పేరు మీద పట్నం వేస్తారు. ఇక్కడ లేని విధముగా ఖండేల రాయుడు విగ్రహం అందరిని ఆకర్షిస్తుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో రాజగోపురం నిర్మించడం దేవాలయానికి ప్రధాన ద్వారముగా బాసిల్లు తోంది. ఇక్కడ ప్రతినిత్యం శైవాగమ పద్ధతితో పూజలు చేయడం, శివ పూజ ,సహస్ర నా మార్చిన, రుద్రాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది రోజు జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో ,ధర్మకర్త మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు చేశారు.