- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపులు వద్దు.. కలిసి పని చేయండి : కేటీఆర్
దిశ,ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ లీడర్లకు మంత్రి కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గంలో , మండలం లో జోరుగా చర్చ జరుగుతుంది. ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు రెండుగా వీడిపోయి ఒకవర్గంపై ఒక్కరు ఆరోపణలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే... ముస్తాబాద్ మండల నేతల మధ్య వివాదం కాస్త కేటీఆర్ దృష్టికి పోవడంతో నాలుగు నెలలుగా తన స్వంత నియోజకవర్గంలోని మండలానికి కేటీఆర్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయాలు వాట్సఫ్ లో చక్కర్లు కొట్టింది.. ముస్తాబాద్ బీఆర్ఎస్ లో నేతల మధ్య నెలకొన్న వివాదాలపై ‘దిశ’ పత్రికలో ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. తాజాగా ‘ ముస్తాబాద్ వైపు కన్నెత్తి చూడని కేటీఆర్’ కథనంపై స్పందించిన మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ నేతలను హైదరాబాద్ పిలుచుకొని క్లాస్ తీసుకున్నట్లు ఇటు మండలం లో , అటు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గ్రూపులు కట్టద్దు.. కలిసి పని చేయండని కేటీఆర్ హితవు పలికినట్లు ప్రచారం జరుగుతుంది.