మంత్రి కేటీఆర్ ఇలాకాలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడుతున్న ప్రజలు

by samatah |
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడుతున్న ప్రజలు
X

దిశ,గంభీరావుపేట : సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం‌లోని గంభీరావుపేట మండల కేంద్రంలోని నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షాల మారింది. గతంలో గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలు నిత్యం వైద్య సేవలు నిమిత్తం ప్రజలు నిత్యం సుమారు 150 నుండి 200 మంది పేషెంట్లు వైద్యం కోసం వచ్చేవారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 3 వైద్యులు 1 సిహెచ్ఓ 4 స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉండేవారు. ఉన్నదాంట్లో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించేవారు. కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానంలో గత సంవత్సరం ఈ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్తుగా మార్చడం జరిగింది.

అప్పుడు మొదలైంది ప్రజల జీవితాలతో చెలగటం ఆడటం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఒక వైద్యుడు ఉండడు కానీ పూర్తి స్థాయిలో స్లీపర్లు ఉంటారు. ఎందుకంటే వారు కాంట్రాక్టర్ ఆధీనంలో ఉంటారు కాబట్టి, వారిని పూర్తి స్థాయిలో నియమించుకున్నారు. ప్రజలు ఆసుపత్రికి రావడం ఆసుపత్రి ఎవరు లేరని వెను తిరిగి పోవడం పరిపాటిగా మారింది. ఆస్పత్రికి ఒక సూపర్డెంట్ అతను డెంటిస్ట్ అప్పటి నుండి సూపర్డెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ రోగులకు మందులు రాస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు .అయితే కొన్ని నెలల క్రితం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ను ఇక్కడకు ప్రభుత్వం పంపడం జరిగింది ఇద్దరు వైద్యులలో ఒకరు డెంటిస్ట్ ఒకరు జనరల్ డాక్టర్ అయితే వీరు రోజు రావడం ,సంతకం చేయడం రెండు మూడు గంటల వరకు ఉండడం తిరిగి తమ సొంత ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు అందించడం వారికి అలవాటుగా మారింది.

సుమారు పదిహేను 15వేల వరకు జనాభా ఉన్న మండల కేంద్రంలోని ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షల మారింది. ప్రభుత్వ ఆస్పత్రి ఉందని నమ్మి వచ్చిన ప్రజలకు ఆసుపత్రిలో ఉన్న ముగ్గురు వైద్యులు 3 స్టాఫ్ నర్సులు ఎప్పుడూ ఉంటారో ఎప్పుడు ఉండరో వారికే తెలువని పరిస్థితి ఎవరైనా వచ్చి అడుగుతే ఇప్పుడే వెళ్లారంటూ ఉన్నవారు ఇచ్చే సమాధానం. కాగా ఈ వైద్య విధాన పరిషత్తులో నూతనంగా కాంట్రాక్ట పద్ధతిలో 13 మంది సిబ్బందిని నియమించుకున్నారు ,అందులో 4 కేర్ టేకర్లు, 5 స్లీపర్లు ,3 వాచ్ మెనులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొస మెరుపు ఏమిటంటే స్లీపర్ లే నర్సులుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తున్నారు .ఉన్న డాక్టర్‌లు సమయపాలన పాటించరు కానీ ఉన్న సిబ్బందికి ఎవరైనా వస్తే ఏ మందులు ఇవ్వాలో చెప్పే రెండు మూడు రకాల మందులను అందుబాటులో ఉంచి వారి పని వారు కానీచేస్తున్నారు .ఎవరైనా పాత్రికేయులు వెళ్లి అడిగితే ఇక్కడకు మేము రావడమే ఎక్కువ, మాది కూడా డిప్యూటేష నేనని ఎక్కువగా మాట్లాడితే మాస్థానానికి మేము వెళ్తామని ఎదురు సమాధానం చెపుతున్నారు .

స్లీపర్లచే వైద్య చేయి‌స్తే ఎవరికైనా ఏదైనా జరుగుతే ఎట్లా అని అడిగితే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏదైనా జరిగినప్పుడు చూస్తాం లే అని చెప్పడమే కాకుండా, ఏం చేసుకుంటావో చేసుకోమని సమాధానం ఇవ్వడం బట్టి చూస్తే ఇది ఆసుపత్రి, మీరు డాక్టర్ అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు .లేని పోకడలకు పోయి ఉన్న సిబ్బందిని కాస్త లింగన్నపేట ఆసుపత్రిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి, అక్కడకు పంపడం లేని ఆసుపత్రిని ఇక్కడ చూపిస్తూ పేద ప్రజల ప్రాణాలతో స్లీపర్లతో వైద్య చేయడమే కాకుండా మందులు ఇప్పించడం ఏంటని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు .

ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్య అందించాలని చెబుతున్నప్పటికీ ఇక్కడ జరిగేదేమో భిన్నంగా ఉండడం ఏంటని గుసగుసలాడుతున్నారు. ఇంకా గర్భిణీల సంగతి చెప్పనవసరం లేదు ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇక్కడ సిబ్బంది కొరతతో ఉండడమే కాకుండా స్లీపర్లు వైద్యం చేయడంతో గర్భిణీలు ఆస్పత్రికి రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా ఈ విధానాన్ని మార్చి పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని గర్భిణీలకు ఇక్కడే ప్రసవం జరిగేలా చూడడానికి అవసరమైన అనుభవకులైన వైద్యులను పంపించాలని మంత్రి కేటీఆర్ ని, కలెక్టర్‌ను ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed