దిశ ఎఫెక్ట్.. హోటళ్లను తనిఖీ చేసిన అధికారులు..

by Sumithra |
దిశ ఎఫెక్ట్.. హోటళ్లను తనిఖీ చేసిన అధికారులు..
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలోని దాదాపు 25 హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్, పానీపూరి సెంటర్ లను మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్, ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేశారు. దిశ పత్రికలో మంగళవారం "ప్రజారోగ్యంతో చెలగాటం" అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ అధికారులు వరంగల్ రోడ్, కరీంనగర్ రోడ్డు, జమ్మికుంట రోడ్డు, సూపర్ బజార్ ఏరియా ప్రాంతాల్లోని పలు హోటళ్లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పలు హోటళ్ల లోని కిచెన్లు, తినుబండారాలు, ఆహార పదార్థాలను, అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశీలించి యజమానులను హెచ్చరించారు. తక్షణమే హోటళ్లలో, బేకరీలలో, పానీపూరి సెంటర్లలో పరిశుభ్రమైన వాతావరణము ఉండాలని లేనియెడల జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లకు తొందరలోనే నోటీసులు అందించి జరిమానాలు విధిస్తామని ఈ సందర్భంగా కిషన్ రావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వినయ్, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, జవాన్లు అనిల్ ,సుధీర్ ,వలి పాషా తదితరులు పాల్గొన్నారు.

Next Story