- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంకుస్ధాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. నిలదీసిన ఎంపీటీసీ
దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు. ఇందులో భాగంగా దోమడుగు గ్రామ పరిధిలో మహిళ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండగా వివాదాస్పద వాతావరణం ఏర్పడింది. గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకున్న ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళా భవనం నిర్మాణంతో పాటు ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, 60 శాతం జనాభా కలిగి ఉన్న కాలనీలో అర కిలో మీటర్ కు పైగా నడిచి వెళ్తున్నారని చెప్పారు. హైవే రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. అంతేకాకుండా గత ఎనిమిది నెలల క్రితం 12వ వార్డులో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన పనులు మాత్రం జరగలేదన్నారు. వాటి కోసం కేటాయించిన నిధులు 25 లక్షల రూపాయలు ఏమయ్యాయని పాలకవర్గాన్ని నిలదీశారు. మూడు రోజుల్లో పరిష్కారం జరగకపోతే గ్రామ ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని పాలకవర్గాన్ని హెచ్చరించారు.