పెద్దపల్లి జిల్లాలో మూడు రోజులు సందడి చేయనున్న సినీనటి తమన్నా

by Kalyani |
పెద్దపల్లి జిల్లాలో మూడు రోజులు సందడి చేయనున్న సినీనటి తమన్నా
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపెల్లి గ్రామ శివారులో హీరోయిన్ తమన్నా శనివారం సినిమా షూటింగ్ జరిగింది. మడి పల్లి గ్రామంలోని హుస్సేన్ మియా వాగు ప్రాంతంలో నిర్మించిన శివలింగమునకు హీరోయిన్ తమన్నా అభిషేకం సీన్ షూటింగ్ చేశారు. తమన్నా ప్రధాన భూమిక పోషిస్తున్న ఓదెల 2 సినిమా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తమన్నాతో శివలింగం అభిషేకం షూటింగ్ జరిగింది. దర్శకుడు సంపత్ నంది పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన వారు కావడంతో ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో ఓదెల సినిమా తీసిన సంపత్ నంది ప్రస్తుతం ఓదెల టు సినిమా తీస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ సిబ్బంది తెలిపారు. దర్శకుడు సంపత్ నందిని ఓదెల మాజీ సర్పంచ్ ఆకులమహేందర్, మున్నూరు కాపు స్టేట్ యూత్ కన్వీనర్ ఆకుల వివేక్ పటేల్ శాలువాతో సన్మానించారు.

Advertisement

Next Story

Most Viewed