- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన MLC Kalvakuntla Kavitha
దిశ, మెట్ పల్లి: తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆడబిడ్డలందరికీ మన పండుగైన బతుకమ్మను కాపాడుకోవాలనే ఆలోచన ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మినీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తన మనసుకు అత్యంత దగ్గరైన పండుగ బతుకమ్మ అని చెప్పారు. రోజంతా పనిచేసిన కష్టాలన్నింటినీ మర్చిపోయి, పుట్టింటికి వెళ్లి అందరితో కలిసి సంతోషంగా ఆడిపాడే పండుగ బతుకమ్మ అని అన్నారు.
మన చుట్టుపక్కల దొరికే పువ్వులనే దేవుడిగా కొలిచే పండుగ బతుకమ్మని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా చెరువులు నిండుగా ఉన్నాయని, ప్రతి చోట బతుకమ్మ కోసం సర్పంచ్‌లు, ఇతరులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారని తెలిపారు. అనంతరం వందలాది మంది ఆడబిడ్డలతో కలిసి ఆమె ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ ఛైర్మన్ దావ వసంత సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.