పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

by Sumithra |
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
X

దిశ, తిమ్మాపూర్ : మానకొండూర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల పంచాయతీ రాజ్ ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈలతో సమీక్షసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా చేపట్టిన పలుఅభివృద్ధి పనులకు రూ.60కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే సంబంధిత మంత్రి సీతక్కతో మాట్లాడి పనులు మంజూరు చేయిస్తానని అన్నారు. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సమావేశంలో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story