సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే రమేష్ బాబు

by Shiva |   ( Updated:2023-08-30 11:20:27.0  )
సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే రమేష్ బాబు
X

దిశ, వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా తనను నియమించినందుకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆరు దశాబ్ధాల వ్యవసాయ సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం దశాబ్ధ కాలంలో అధిగమించారని తెలిపారు.

సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలు, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేశ్ బాబు తెలిపారు. సిఎం సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతున్న సమయంలో సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

Advertisement
Next Story

Most Viewed