పేద కుటుంబాలకు కేసీఆర్ కొండంత అండ : MLA Dasari.Manohar Reddy

by samatah |   ( Updated:2023-01-07 09:40:26.0  )
పేద కుటుంబాలకు కేసీఆర్ కొండంత అండ : MLA Dasari.Manohar Reddy
X

దిశ, ఓదెల: తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భారం కావద్దని భావించి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండంత అండగా నిలుస్తున్నరని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శని వారం ఓదెల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 56 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమం ప్రతి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. పేద కుటుంబాల్లో ఆనందం నింపుతున్న పథకం కళ్యాణ లక్ష్మి అన్నారు. మాంజూరైనా కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులు ముఖాల్లో అనందం చూస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద యువతి పెళ్లికి కళ్యాణలక్ష్మి ఓ వరంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని, రానున్న రోజుల్లో అభివృద్దిలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందన్నారు. యావత్‌ భారతవనిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ ఫలాల అమలవుతుండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమానికే కేసీఆర్‌ పెద్దపీఠ వేశారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ప్రస్తుతం కాలంలో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఆర్థికశ్రమతో కూడుకుందని, ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ తన వంతు బాధ్యతగా కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి, అమలుచేస్తు పేదింటి కుటుంబాల్లో ఆనంద వెలుగులు నింపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల తసీల్దార్ కే రమేష్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీపీ రేణుక దేవి, బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి , రైతు సమన్వయ సమితి కన్వీనర్ కావటి రాజు యాదవ్, సర్పంచులు పూలుగు తిరుపతిరెడ్డి, పల్లె ఓదెలు, ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి -చిన్న స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed