- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనార్టీలు ఎంఐఎం కి కేవలం ఓటు బ్యాంకు మాత్రమే..
దిశ, కరీంనగర్ టౌన్ : దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మైనారిటీ ప్రజలకు భద్రతని, సంక్షేమాన్ని కల్పించడమే గాక వాళ్ళ స్వాలంబనకి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ ఉద్ఘాటించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని తెలిపారు. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొన్ని రోజులక్రితం బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్స్ తొలగిస్తామని చేసిన ప్రసంగంపై ఎంఐఎం ఎలాంటి పోరాటం చేయకపోవడం వాళ్ళ రాజకీయ సంబంధాలకు మాత్రమే ముస్లిం మైనారిటీలను వాడుకుంటున్నట్టు స్పష్టమైందన్నారు.
అంబేద్కర్ భారత రాజ్యాంగం 29, 30 ఆర్టికల్ లో పొందుపరిచిన విధంగా ఇన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 1993లోనే మైనారిటీ కమిషన్ ని ఏర్పాటు చేసి వందల కోట్ల నిధులు కేటాయించి, వారి పిల్లలకు విద్య, ఉపాధి కల్పించిందని ఆయన తెలిపారు. అంతేగాకుండా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ ప్రత్యేక చొరవ తీసుకొని పట్టణ పేదరిక నిర్మూలనకు మెప్మాని ఏర్పాటు చేసి ముస్లిం మహిళలకు రుణసదుపాయం కల్పించడం, కుట్టు మెషిన్లను పంచి సొంత కాళ్ళ మీద నిలబడేలా చేశారన్నారు. ముస్లిం షాదీఖానాలు, ఉర్దూ పాఠశాలలు, ఉర్దూ విశ్వవిద్యాలయం స్థాపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సుజిత్ కుమార్ గుర్తుచేశారు. ముస్లింలతో పాటు జైనులకు మైనారిటీ రిజర్వేషన్స్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
జైనుల పిల్లలకు ఉన్నత విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు ఈ రిజర్వేషన్స్ ఉపకరించాయని తెలిపారు. క్రిస్టియన్, సిక్కు, బుద్దిస్ట్ ప్రజలకు కూడా మైనారిటీ సంక్షేమ నిధులు కేటాయించిన నిఖార్సైన సెక్యూలర్ పార్టీ అని కాంగ్రెస్ నిరూపించుకుందన్నారు. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్స్ ని 12% కి పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వంపై ఏరోజూ పోరాటం చేయని ఎం పార్టీ, అమిత్ షా వ్యాఖ్యల అనంతరం కూడా పెద్దగా స్పందించని ఎంఐఎం, ఏ రోజూ కూడా ఉర్దూమీడియం పాఠశాలల పరిస్థితిపై, ముస్లిం పిల్లల నాణ్యమైన విద్య కై, ముస్లిం మహిళల కుట్టు మిషన్ల పంపిణీలో కరీంనగర్ లో జరిగిన అవినీతి పై స్పందించని ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే రాజకీయాలకు సిద్ధమవుతోందని విమర్శించారు. ముస్లిం మైనారిటీలతో పాటు కరీంనగర్ లోని సిక్కు, జైన, క్రిస్టియన్, ఇతర మైనారిటీ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.