బీఆర్ఎస్ నాయకుడిపై మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు దాడి.. కనుబొమ్మపై తీవ్ర గాయం

by Disha Web Desk 9 |
బీఆర్ఎస్ నాయకుడిపై మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు దాడి.. కనుబొమ్మపై తీవ్ర గాయం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకుడు బుర్ర శంకర్ గౌడ్‌పై మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు దాడి చేయడం కలకలం రేపింది. బేగంపేట గామంలోని హమాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడే వేడుకలకు ఆహ్వానం మేరకు బేగంపేట సర్పంచ్ బుర్ర పద్మ భర్త శంకర్ గౌడ్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు దాసరి శివ కుమార్, దాసరి శ్రీనివాస్ కలిసి బుర్ర శంకర్ గౌడ్ పై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో శంకర్ గౌడ్‌కు ఎడమ కన్నుకు తీవ్ర గాయం అయింది.

Next Story

Most Viewed