- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ వ్యవస్థకు బండి సంజయ్ కలంకం: మంత్రి కొప్పుల
దిశ, జగిత్యాల ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే మాటలతో రాజకీయాలలో ఒక కలుషిత వాతావరణం ఏర్పడిందని, రాజకీయ వ్యవస్థకు బండి సంజయ్ కలంకం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడని, ఆయనను చూసి ఇతర బీజేపీ నాయకులు కూడా అదే విధంగా తయారయ్యారని విమర్శించారు. గతంలో జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించగా తాజాగా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి అధికారులతో సమీక్ష అనంతరం కొండగట్టును అభివృద్ధి చేసేందుకు అవసరమైతే రూ. 1000 కోట్ల వరకు వెచ్చిస్తామని సీఎం హామీ ఇస్తే బీజేపీ నాయకులు దానిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు.
భూ దందా చేయడానికి సీఎం వచ్చారని సంజయ్ మాట్లాడడం బాధాకరం అన్నారు. దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడే బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలన్నారు. కొండగట్టు అభివృద్ధికి దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని లేనిపక్షంలో భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్న బండి సంజయ్ బే షరతుగా హనుమాన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.