- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుపాకులతో బెదిరించారు.. బీజేపీ నేతలకు మంత్రి గంగుల హెచ్చరిక
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీలో అసమ్మతి నెలకొనడంతో, లుకలుకలు మొదలు కావడంతో ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరుతున్నారన్న అక్కసుతో దాడులకు పూనుకుంటున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పరామర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన ఇంటిపై దాడికి పాల్పడడాన్ని గంగుల తీవ్రంగా ఖండించారు. తాను మంత్రిగా ఆగయ్యను పరామర్శించేందుకు రాలేదని, ఒక కార్యకర్తగా, కుటుంబ సభ్యునిగా పరామర్శించేందుకు వచ్చానన్నారు. గోపి అనే వ్యక్తి తుపాకీతో, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని దాడికి పాల్పడ్డారని గంగుల ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తకు గాయం అయినా తమకు నొప్పి కలుగుతుందన్నారు.
జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటి మీద దాడి చేసిన బీజేపీ ముష్కరులు ఆయన్ని చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాంచందర్, సాయి సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టారని, చట్టాన్ని గౌరవించి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే టీఆర్‌ఎస్ నాయకులపై రాళ్లు రువ్వారన్నారు. యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని తెలంగాణాలో తీసుకువస్తున్నారని మంత్రి గంగుల మండిపడ్డారు.
బీజేపీ నాయకులు విధ్వంసాన్ని, దాడులనే నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఖబడ్ధార్ బీజేపీ నాయకుల్లారా.. మా బలం ముందు మీ బలం చాలా చిన్నదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మెసెజ్ లు పెట్టి రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ స్టేషన్ పై రాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణాలో ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగిన తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి గంగుల హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల దాడులపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ను కంట్రోల్ లో ఉంచాలని డీజీపీని కోరారు. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అదేశాలివ్వాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ రవిందర్ రావు తదితరులు ఉన్నారు.
మానేరు వంతెనపై రాస్తారోకో..
మరోవైపు టీఆరెఎస్ నాయకులు సిరిసిల్ల మానేరు వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై దాడికి నిరసనగా ఈ ఆందోళన నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో సిరిసిల్ల హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఎల్లారెడ్డిపేట, కామారెడ్డి హైవేపై కూడా టీఆరెఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.