మేడేను విజయవంతం చేయాలి..

by Sumithra |   ( Updated:2023-04-30 11:08:17.0  )
మేడేను విజయవంతం చేయాలి..
X

దిశ, శంకరపట్నం : రేపు జరగబోయే మేడే ఉత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మయ్య మాట్లాడారు.

కార్మిక, కర్షకుల హక్కుల సాధన కోసం లాల్ జెండా పోరాటాన్ని గుర్తు చేసుకునే రోజు మేడే అన్నారు. సోమవారం జరగబోయే 137వ ప్రపంచ కార్మిక దినోత్సవం గా మేడే ను రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కర్షకులు అభిమానులు ప్రతి గ్రామంలో హాజరై జెండాలను ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించాలని, కార్మికులకు, కర్షకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు రవి, లక్ష్మణ్, రాజు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed