- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికుల సమష్టి పోరాట ఫలితమే మే డే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి : కార్మికుల సమష్టి పోరాట ఫలితమే మే డే అని కార్మికులు తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో ఐఎన్టీయూసీ 327 అధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకలు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ ముందు వరుసలో ఉంటుందన్నారు.
విద్యుత్ కార్మికుల సమస్యలైన ఫిట్మెంట్, వేతనాలు పెంపు,ఆర్టిజెన్ల హక్కుల సాధనలో ఐఎన్టీయూసీ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను రాష్ట్రం స్ఫూర్తిగా, మార్గదర్శకంగా తీసుకుని మెరుగైన సేవలు అందించాలని కోరారు. విద్యుత్ కార్మికుల సమస్యల్ని తన దృష్టికి తీసుకువస్తే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ వారి వెన్నంటే ఉంటానని భరోసానిచ్చారు.ఈ వేడుకల్లో ఐఎన్టీయూసీ నాయకులు తిరుపతి రెడ్డి, రాంజీ నాయక్, ప్రమోద్, శంకర్,రాజమౌళి, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కల్లేపల్లి దుర్గయ్య పాల్గొన్నారు.