- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మల్యాల మండల వాసి
ఉత్కంఠ రేపుతున్న నిందితుల విచారణ
దిశ, మల్యాల: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో జగిత్యాల జిల్లా వాసి ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులు ఉండగా ఏ2 ముద్దాయి మల్యాల మండలం తాటిపెళ్లి గ్రామానికి చెందిన వాడు కావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన అట్ల అంజిరెడ్డి కుమారుడు అట్ల రాజశేఖర్ రెడ్డి గత ఐదేళ్లుగా టీఎస్పీఎస్సీలో సెక్యూరిటీ నెట్ వర్క్ అడ్మిన్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును ఛేదించిన పోలీసులు అట్ల రాజశేఖర్ పాస్ వర్డ్ మరియు డాటా సేకరించి ప్రవీణ్ అనే నిందితునికి అప్పగించినట్లుగా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో రాజశేఖర్ ను కేసులో ఏ2 ముద్దాయిగా గుర్తించడంతో తన స్వగ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదటి ముద్దాయి ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగి కావడం, కార్యాలయంలో అధికారులతో సాన్నిహిత్యంగా మెదులుతుండేవాడని తెలిసింది.
తన స్వలాభం కోసం రాజశేఖర్ రెడ్డిని పావులా వాడుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తను స్వతహాగా రాజశేఖర్ మృదుస్వభావి, మంచి వ్యక్తిత్వం గల వాడని, అతను ఇలాంటి పనికి చేశాడంటే నమ్మశక్యంగా లేదని, ఎవరో తనను ప్రలోభ పెట్టి ఉంటారని తన సన్నిహితులు, బంధువులు, గ్రామస్థులు తెలిపారు.