లింగంపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం..?

by Aamani |
లింగంపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం..?
X

దిశ, చందుర్తి : చందుర్తి మండలం లోని లింగంపేట్ శివారులోని కొత్త కుంట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం చేస్తుందని అటవీ శాఖ వారు ఆనవాళ్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే లింగంపేట గ్రామానికి చెందిన ఈగ రాజేశం అనే రైతు మేక మంద నుండి సాయంత్రం తప్పిపోయిందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా కొత్త కుంట అడవి ప్రాంతానికి వెళ్లి చూడగా మేక కళేబరాన్ని చూశారు.రైతు రాజేశం మాట్లాడుతూ 20 వేల విలువగల మేక చనిపోయిందని నష్టపరిహారం చెల్లించాలని అటవీశాఖ అధికారులను కోరాడు. కొత్త కుంట అటవీ ప్రాంతంలో పశువులను ఉంచరాదని లింగంపేట రైతుల అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారి శేఖర్ వెల్లడించారు. రైతు రాజేశం కు తప్పకుండా నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు.



Next Story