- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ది : కొప్పుల
దిశ, వెల్గటూర్ : బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎండపల్లి మండలం కొండాపూర్ లో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. గ్రామస్తులు, మహిళలు బతుకమ్మలు మంగళ హరతులు పట్టి మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గత పాలకులు ఏనాడు గ్రామాల అభివృద్ది కోసం ఆలోచన చేయలేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దళితుల అభ్యున్నతికి దళిత బందు తీసుకువచ్చారని చెప్పారు. గడిచిన 60 ఏళ్ళుగా దళితులు అనగ దొక్కబడ్డారని, ఇప్పటికైనా ప్రతీఒక్కరు గ్రహించాలని కోరారు. ధర్మపురి ఎస్సీ కుటుంబాలు అదృష్టవంతులని చెప్పారు. ప్రతీ ఇంటికి దళిత బందు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. గ్రామం చిన్నది అయినప్పటికి అభివృద్ధి చేసింది, ప్రజలు గుర్తించాలని కోరారు. మాయ మాటలు చెప్పే వారి మాటలు నమ్మితే ప్రజలు మోసపోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ ఛైర్మన్ గూడ రామ్ రెడ్డి, కోటిలింగాల ఆలయం చైర్మన్ నారాయణరావు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.