- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసలేని స్పీచ్‌లు.. ఒకే తరహా ప్రసంగంతో ఆకట్టుకోలేకపోతున్న సీఎం కేసీఆర్..!
దిశ, కరీంనగర్బ్యూరో/చొప్పదండి/జమ్మికుంట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలు ఉమ్మడి కరీంనగర్జిల్లాలో మూడుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులను నిరుత్సహపరిచాయి. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రజాఆశీర్వాద సభలో పాల్గొనగా కేసీఆర్మాట్లాడుతుండగానే జనం లేచిపోవడం కనిపించింది. మూడుచోట్ల ఒకే తరహ స్పీచ్ఇవ్వడంతోపాటు చొప్పదండి, హుజూరాబాద్‌లో కేసీఆర్తక్కువ సమయం ప్రసంగించడం ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యానికి గురి చేసింది.
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో కరీంనగర్చేరుకున్న కేసీఆర్ఎస్ఆర్ఆర్కళాశాలలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కేసీఆర్ స్పీచ్ ప్రారంభించడంతోనే జనాలు ఇంటి దారి పట్టారు. ముఖ్యమంత్రి స్పీచ్ఇస్తుండగానే వేల సంఖ్యలో జనాలు ఇంటి దారి పట్టడంతో కరీంనగర్, జగిత్యాల రహదారిపై ట్రాఫిక్ జామైంది. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభ అనుకున్న స్థాయిలో సక్సెస్‌కాలేదు. రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన సభలో కనీసం పట్టుమని 15నిమిషాలు కూడా సీఎం మాట్లాడకపోవడంతో ఎమ్మెల్యే అభ్యర్థి రవిశంకర్‌తోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ చెందారు.
ఇక మరోవైపు సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకోకముందే వచ్చిన జనాలు వచ్చినట్లు తిరుగు పయనమయ్యారు. సీఎం స్పీచ్ మొదలవడానికంటే ముందే సభా ప్రాంగణంలో చాలా వరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సీఎం వచ్చి మాట్లాడతాడని ఎదురుచూస్తున్న జనాలకు స్పీచ్‌లో పెద్దగా ఆకట్టుకునే విషయాలు లేకపోవడంతో వచ్చిన ప్రజలు సైతం నిరాశకు గురయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థితోపాటు కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీఎం కేసీఆర్ సభతో పెద్దగా జోష్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది.
15 నిమిషాల్లోనే ముగిసిన స్పీచ్..
హుజూరాబాద్, కరీంనగర్, చొప్పదండిలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండడంతో సీఎం కేసీఆర్ సభతో కాస్తా జోష్వస్తుందని అందరూ భావించారు. కేసీఆర్స్పీచ్లో ఏదో చెప్తాడని ఆశగా ఎదురుచూసిన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కొండగట్టు అంశం మినహా మిగతావన్నీ ఇతర సభలలో మాట్లాడిన కామన్ పాయింట్స్ కావడం గమనార్హం. స్పీచ్‌లో జోష్ తగ్గడంతోపాటుగా కేవలం 15నిమిషాల్లోనే ప్రసంగం ముగించడంతో చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవిశంకర్ డిసప్పాయింట్ అయినట్లుగా తెలిసింది. సభ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఓటింగ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చర్చికుంటున్నాయి. ఆశీర్వాద సభలు అట్టర్‌ఫ్లాప్ అంటు కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
నేతల సమన్వయ లోపం..
సీఎం ఆశీర్వాద సభ కోసం మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్శ్రేణులు వారం రోజుల ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తు వస్తున్నారు. సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఉద్దేశంతో భారీగా జన సమీకరణకు ప్లాన్చేశారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలించడానికి ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో కేసీఆర్సభలు సక్సెస్కాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్స్పీచ్లో నగర పార్టీ అధ్యక్షుడి పేరును తప్పు చదవడం, డిప్యూటీ మేయర్పేరును తప్పగా ఉచ్చరించడంతో నేతల మధ్య సమన్వయం బయటపడినట్లు కనిపించింది.
గంగధర సభకు వచ్చిన వారికి మంచినీళ్లు అందించకపోవడంతో కొంతమంది సీఎం కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకోక ముందే తిరుగు పయనమయ్యారు. సీఎం స్పీచ్ ఇస్తుండగా మరి కొందరు వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. జమ్మికుంట సభలో జెడ్పీ చైర్మన్‌ను వేదికపైకి వెళ్లకుండ పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాసుల జారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే సమస్యలు వచ్చాయని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ద్వారా మైలేజ్ వస్తుందనుకుంటే అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో మైనస్అయిందని పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది.
ఇంచార్జీల చేతివాటం..
గంగాధర ప్రజా ఆశీర్వాద సభలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. జన సమీకరణలో కీలకంగా వ్యవహరించిన ఇన్చార్జీలు సభకు వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామని తీసుకొచ్చి పైసా ఇవ్వలేదు సరి కదా కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మీటింగ్‌కు వస్తే రూ.300 ఇస్తామని తీసుకొచ్చి రూ.150మాత్రమే ఇచ్చారని మరి కొందరు బాహాటంగానే పట్ల తిట్ల దండకం అందుకున్నారు.