- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం : ఎంపీపీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. ప్రభాకర్ రెడ్డి
దిశ, సైదాపూర్ : రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గోడిశాల, వెన్నంపల్లి, దుద్దెనపల్లి, సైదాపూర్, రాయికల్, ఆకునూరు క్లస్టర్ రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతుభీమా రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చందా శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు బిల్లా వెంకట్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రావుల రవీందర్ రెడ్డి, తహశీల్దార్ బావుసింగ్, మండల వ్యవసాయ అధికారి వైదేహి, ఎంపీడీవో అర్.పద్మావతి, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ లు ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి కన్వీనర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.