ధర్మాన్ని అవమానిస్తూ ఓట్లు అడుగుతున్నారు : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 23 |
ధర్మాన్ని అవమానిస్తూ ఓట్లు అడుగుతున్నారు : ధర్మపురి అరవింద్
X

దిశ,కోరుట్ల టౌన్: కాంగ్రెస్ నాయకులు సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఓట్లు అడుగుతున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల లో జరిగిన ప్రచాార సభలో ఆయన మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ నేతలు ముస్లిం ఓట్ల కోసం టోపీలు పెట్టి చివరికి వారి నెత్తినే టోపీ పెడతారని విమర్శించారు. భరతమాత గురించి రాముని గురించి అడ్డగోలుగా మాట్లాడి ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా పొందాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజలు ఓట్లతో గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.

జీవన్ రెడ్డి మతోన్మాదులను రెచ్చగొడుతూ ధర్నాలు చేస్తూ రాజకీయం చేయడం తగదన్నారు. బిఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ నేతలకు తీసిపోకుండా మత రాజకీయాలు చేస్తూ తాము సెక్యులర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రానున్న ఎన్నికల్లో ధర్మాన్ని గెలిపించాలని, కమలం పువ్వుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. మరోసారి మోడీ ప్రభుత్వం రావడం ఖాయమని, రానున్న కాలంలో సనాతన ధర్మ స్థాపన పరిపూర్ణం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ ,సుఖేందర్ గౌడ్, నాయకులు యాదగిరి బాబు, ఇందూరి తిరుమల వాసు, రుద్ర శ్రీనివాస్, సంకు సుధాకర్, బింగి వెంకటేష్, చిరుమల్ల ధనంజయ్, పెండెం గణేష్, మాడవేని నరేష్, ఇందూరి సత్యం, సుదవేని మహేష్, కలాల సాయిచంద్ నాయకులు పాల్గొన్నారు.

Next Story