బిల్లులు చెల్లించకపోతే.. ముకుమ్మడి రాజీనామాలు చేస్తాం : రాయికల్ మండల సర్పంచ్ ల అల్టీమేటం

by Shiva |
బిల్లులు చెల్లించకపోతే.. ముకుమ్మడి రాజీనామాలు చేస్తాం : రాయికల్ మండల సర్పంచ్ ల అల్టీమేటం
X

దిశ, రాయికల్: రాష్ట్రంలో సర్పంచ్ ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్తులు అమ్ముకొని అప్పు తీసుకొచ్చి మరి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే, కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు గాని పంచాయతీ ట్రాక్టర్లలో పోసుకున్న డీజిల్ కు డబ్బు చెల్లించలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు.

సర్పంచ్ ల దయనీయ పరిస్థితికి అద్దం పట్టేలా బుధవారం రాయికల్ మండలంలో 32 గ్రామాల సర్పంచ్ లు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. గ్రామాభివృద్ధికి చేసిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని అందులో విన్నవించారు. అంతే కాకుండా ఎస్టీవోలో జమ చేసిన చెక్కులపై ఉన్న ఫ్రీజింగ్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్ నెలాఖరు వరకు పెండింగ్ బిల్లులు విడుదల చేయని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో సర్పంచ్ లు అనుపూరం శ్రీనివాస్, బేక్కం తిరుపతి, బత్తిని రాజేశం, రవి, కైరి ముత్తయ్య, అత్తి నేని రంగారెడ్డి, రామచంద్రరావు, నాయకులు సామల్ల వేణు, బేజ్జంకి మోహన్, మారంపల్లి హరీష్, చింతపల్లి గంగారెడ్డి, నర్సయ్య, రాగి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story