- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్ సిటీజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం భరోసా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
దిశ, జగిత్యాల ప్రతినిధి : సీనియర్ సిటీజన్లు, పెన్షనర్లకు తెలంగాణ సర్కారు భరోసా కల్పిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్, పెన్షనర్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రం రూపొందించిన తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని కేంద్రమే పట్టించుకోలేదన్నారు.
సీనియర్ సిటీజన్లు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పెన్షనర్స్ అస్సోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం నిధులతో పాటు సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ కు కేటాయించిన భవనం మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించినట్లు హరి అశోక్ కుమార్ తెలిపారు.
ఉద్యోగులు, పెన్షనర్స్, జర్నలిస్టులకు నగదు రహిత వైద్య సేవల కోసం జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రయత్నం చేస్తుండడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షుడు పీ.సీ హన్మంత్ రెడ్డి, ఎండీ.యాకూబ్, జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి వెలముల ప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావు, మహిళా కార్యదర్శి బొబ్బాటి కరుణ, సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.