- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ పాలనతో భారత రాజ్యాంగ వ్యవస్థకు పెను ప్రమాదం: మంత్రి గంగుల
దిశ, కరీంనగర్ టౌన్: ప్రపంచంలో భారత రాజ్యాంగం గొప్పదని, రాజ్యాంగం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పాలనతో భారత రాజ్యాంగ వ్యవస్థకు పెను ప్రమాదం వాటిల్లుతోందని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం 73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు సర్కిల్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ పలు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలను కూల్చివేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. బీజేపీని ప్రజలు గద్దె దించకపోతే ఉత్తరాది పరిస్థితులు తెలంగాణలోనూ పునరావృతమైతాయని అన్నారు. అందరూ కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకుని రచించారన్నారు. రాజ్యాంగాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేస్తు 1949 నవంబర్‌లో ఆమోదం పొందిందని తెలిపారు. అప్పటినుంచి దేశంలో సార్వబౌమత్వ, సామ్యవాద, లౌకికవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అయ్యిందని తెలిపారు. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదిన అమలులోకి రావడం జరిగిందన్నారు. రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం అందరికీ సమాన హక్కులు, విధులు మరియు ఆదేశ సూత్రాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, చల్లా హరిశంకర్, మేడి మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.