గంగుల.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా : బండి సంజయ్

by Aamani |   ( Updated:2023-11-13 16:06:09.0  )
గంగుల.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా : బండి సంజయ్
X

దిశ,కరీంనగర్: గంగుల కమలాకర్ దమ్ముంటే చర్చకు రా... తీగలగుట్టపల్లి నిధులు తెచ్చిందెవరో తేల్చుకుందాం.. నిధులు తెచ్చిన నన్ను పిలవకుండా కొబ్బరికాయ కొట్టి తానే నిధులు తెచ్చినట్లుగా ఫోజు కొడుతున్నవ్.. దమ్ముంటే తీగలగుట్టపల్లికి రా.. నిధులు తెచ్చిందెవరో బహిరంగంగా చర్చిద్దాం.. అంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. సోమవారం కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన కూర అనిల్ కుమార్, చింటూ సహా పలువురు నాయకులు బీజీపీలో చేరగా, వారికి బండి పార్టీ | కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగుల కమలాకర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించినప్పటికీ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఆరోబికి 153 కోట్ల రూపాయల నిధులు తాను తీసుకువస్తే గంగుల కమలాకర్ సిగ్గులేకుండా వారి ఫొటోలను పెట్టుకుని తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రారంభిం చారన్నారు.

మూడు సార్లు గెలిచిన గంగుల కమలాకర్ ప్రజలకు చేసిందేమీ లేదని, దోచుకోవడం దాచుకోవడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శించారు. తాను ప్రశ్నించే గొంతుకనని, తనకు పిసికిచంపాలని చూస్తున్నారని బండి వ్యాఖ్యానించారు. పొరపాటున గంగులను గెలిపించినా, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు నరకం చూపిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఊళ్లల్లో భూములను కబ్జా చేసుకుంటారని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నగరంలోని భూములను, గుట్టలను మాయం చేస్తారని, పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను ఒక్కసారి బేరీజు వేసిచుకోవాలని, మీకోసం కొట్లాడేదెవరు? మీకోసం జైలుకుపోయిందెవరు? మిమ్ముల్ని దోచుకునేదెవరో ఆలోచించాలని పేర్కొన్నారు. పొరపాటున గంగుల కమలాకర్ గెలిస్తే కమీషన్ల కోసం కాంట్రాక్టర్ ను బెదిరించి తీగలగుట్టపల్లిలో ఆర్వోబీ పనులు నిలిపివేయించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఓడిపోతాననే భయంతో ఎంఐఎంతో కలిసి గంగుల కమలాకర్ కుట్రలు చేస్తున్నారని, గెలిస్తే మేయర్ పదవిని ఎంఐఎంకు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారన్నారు. తన ఇంటిపై గతంలో ఎంఐఎం గూండాలతో దాడులు చేయించి భయపెట్టేందుకు యత్నించింది ప్రజలందరికీ తెలుసన్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అందరూ ఒక్కటి పువ్వు గుర్తుకు ఓటేసి ఘన విజయాన్ని అందించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed