చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఉగ్రవాదులు.. ఆ అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

by Gantepaka Srikanth |
చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఉగ్రవాదులు.. ఆ అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పెహల్గాం వద్ద అమయాకులను అతి కిరాతకంగా దాడి చేసిన చంపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ(Army), సీఆర్పీఎఫ్‌(CRPF) బలగాలు జమ్మూకశ్మీర్‌ పోలీసుల సాయంతో పెహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నారు. తాజాగా ఉగ్రవాదులు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదులజాడను భద్రతాదళాలు నాలుగుసార్లు కనిపెట్టగా.. తరచూ ఎదురుకాల్పులు జరిపి తప్పించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ కూడా భద్రతా బలగాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదుల దగ్గర చైనా యాప్స్‌, అమెరికా గన్స్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పెహల్గాం దాడి సమయంలో వీరంతా శాటిలైట్‌ ఫోన్‌ వినియోగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. ముందుగా ఉగ్రవాదులను అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. కానీ, దళాలు అక్కడికి చేరేలోపు వారు చిక్కటి అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో, త్రాల్‌ కొండల్లో వారు ఉన్నట్లు దళాలు గుర్తించాయి. చివరగా కొకెర్నాగ్‌లో వారి లొకేషన్‌ బయటపడింది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునేలోపే పారిపోయినట్లు సైనికాధికారి వెల్లడించారు.



Next Story