ఎడ్లబండిపై గణేషుని శోభాయాత్ర

by Sridhar Babu |
ఎడ్లబండిపై గణేషుని శోభాయాత్ర
X

దిశ, కథలాపూర్ : గణపతి నిమజ్జనాన్ని వినూత్నంగా చేయాలనే ఆలోచన వచ్చింది ఆ యువతకు. ఆ ఆలోచనకు పదునుపెట్టి ఎడ్లబండి మీద నిమజ్జనానికి గణపయ్యను సిద్ధం చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో ఆదివారం నిమజ్జనం సందర్భంగా గల్లీ గ్యాంగ్ యూత్ ఎడ్లబండిపై గణపయ్యను నిమజ్జనానికి తరలించేందుకు చేసిన అలంకరణ చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక దుస్తులు ధరించి డప్పు చప్పుళ్లు, నృత్యాలతో గణపయ్యను గ్రామ కూడలి నుండి నిమజ్జనానికి తరలి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed