Former MPP Gopagoni Saraiya Goud: ప్రజా ప్రభుత్వంలో.. పేదల ప్రజాసంక్షేమ బడ్జెట్..!

by Sumithra |
Former MPP Gopagoni Saraiya Goud: ప్రజా ప్రభుత్వంలో.. పేదల ప్రజాసంక్షేమ బడ్జెట్..!
X

దిశ, కాల్వశ్రీరాంపూర్ : కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2024- 25వ సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టరు అని, ఇది పేదల రైతుల కొరకు పెద్దపీట వేశారని, ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సారయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ అందరికీ హర్షించదగ్గ బడ్జెట్ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీలను నెరవేర్చేందుకు, ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కేటాయించారు. అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి బడ్జెట్ కేటాయించడం ఎంత గొప్ప విషయం అని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీకి బడ్జెట్ కేటాయించడం రైతులకు పెద్దపీట వేశారని, రైతు కూలీలకు భూమిలేని వారికి రైతు భరోసా కింద ప్రతిపేద కుటుంబానికి 12 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆర్థిక శాఖమంత్రివర్యులు బడ్జెట్ ప్రవేశ పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలంగాణ ప్రజలంతా సంబరాలు చేసుకుంటారని అన్నారు. ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రివర్గానికి, కృతజ్ఞతలు తెలిపారు.



Next Story