గుట్టుగా భూముల చదును..రైతు భరోసా కోసం పనులు షురూ

by Aamani |
గుట్టుగా భూముల చదును..రైతు భరోసా కోసం పనులు షురూ
X

దిశ,ఎల్లారెడ్డిపేట : రైతు భరోసా కోసం ఎల్లారెడ్దిపేట మండలానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికిప్పుడు సాగు చేస్తూ ఈ బభూమి పదేళ్ల నుంచి సాగులో ఉన్నట్టు రైతు భరోసా కింద రెవెన్యూ రికార్దుల్లో నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి పేట మండలం సింగారం గ్రామంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గతంలో సుమారు రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు ఒక్కో ఎకరం వ్యవసాయ యోగ్యం లేని భూములను కొనుగోలు చేసి కొంతమేర మడులను అచ్చు కట్టి సింగారం గ్రామ రైతులకు కౌలు కు ఇచ్చారు.

కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాగుకు యోగ్యం గా లేని వ్యవసాయ భూములను, బీడు భూములను కోళ్ల, గొర్రెల, ఆవుల షెడ్లను, చెరువులను, కుంటలను పరిశీలించి సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగం రైతు భరోసా పథకం వర్తింపజేయడం కోసం అధికారులు ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టి అర్హులైన సర్వే రిపోర్ట్ ను రైతు భరోసా వర్తింపజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్ సింగారం గ్రామంలో మండల అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సాగుకు యోగ్యం గా లేని భూములను పరిశీలించి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. దీంతో భూములు సాగులో లేకపోయినప్పటికీ తమ భూములు సాగులో ఉన్నట్టు గా చూపాలని బీఆర్ఎస్ నాయకులు మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

సాగులో లేని భూముల వివరాలు..

మండలంలోని సింగారం గ్రామంలో ఇప్పటి వరకు కొంత భూమి సాగులో ఉందని పూర్తి స్థాయిలో సాగులో లేని భూములను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సర్వే చేసి కింది సర్వే నంబర్లు కొంత సాగులో ఉండి మిగతా భూములు సాగులో లేవని గుర్తించినట్లు సమాచారం. గ్రామంలో 266, 268, 270,271,272,273 సర్వే నంబర్లతో పాటు వీటి సబ్ డివిజన్ లలో గల భూములను కూడా జిల్లా, మండల అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

చెలకలు చెడగొట్టి మడ్లుగా మార్పిడి..

సింగారం గ్రామ శివారులో గల వ్యవసాయ యోగ్యం లేని (చెలుక )భూములను గతంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా కొనుగోలు చేశారు. ఒక్కో బీఆర్ఎస్ నాయకుడు 3 నుంచి 5 ఎకరాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి బీడు భూములుగానే ఉంచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక సేద్యం చేయని భూములకు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వబొమని స్పష్టం చేయడంతో గత వారం రోజుల నుంచి జేసీబీ యంత్రాలతో బీడుగా ఉన్న భూములను ఎప్పటి నుంయో వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే కు వెళ్లిన ఓ అధికారిణిని పొలం సాగులో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కాగా సదరు అధికారిణి ససేమిరా ఒప్పుకోనని, తప్పుడు రికార్డు నమోదు చేయబోనని వారితో చెప్పగా ఇటు వైపు రాకూడదని సదరు అధికారిణి ని బెదిరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పదేళ్ల నుంచి రైతుబంధు..

సింగారం గ్రామంలో గత పదేళ్ల నుంచి సాగులో లేక బీడుగా ఉన్న భూములకు సైతం రైతుబంధు పొందారు. పదేళ్లు లక్షలాది రూపాయల సొమ్మును అక్రమార్కుల అకౌంట్లలో జమ కావడంతో పండుగ చేసుకున్నారు. బీడు భూములకు రైతుబంధు వేయించాలని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అధికారం లో ఉన్న కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటా : మండల తహసీల్దార్ బోయిని రాం చందర్

సింగారం భూముల విషయం బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికిప్పుడు సాగు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతాం. నివేదిక ను జిల్లా కలెక్టర్ కు, జిల్లా వ్యవసాయాధికారి కి అందజేస్తాం. రైతు భరోసా విషయంలో సర్వే మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సంయుక్తంగా విచారణ జరుపుతాం.

Advertisement

Next Story