షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

by Aamani |
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ,హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్ లో గల పుల్లూరి భద్రయ్య కు గల మూడంతస్తుల భవనం లో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది.ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలుపుతున్నారు. మూడంతస్తుల ఈ భవనంలో ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కింది గదిలో ఒకరు ఉన్న ప్రమాదం గమనించి బయటకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు పూర్తిగా ఆరిపోయాకా ప్రమాదంలో జరిగిన ఆస్థి నష్టం వివరాలు తెలుస్తాయని అధికారులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed