ఆర్థిక ఇబ్బందులు.. పెళ్లి కావాల్సిన ఇంట్లో చావు..

by Kalyani |
ఆర్థిక ఇబ్బందులు.. పెళ్లి కావాల్సిన ఇంట్లో చావు..
X

దిశ, మెట్ పల్లి: కన్న కూతురి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని ఎన్నో కలలు కన్నా ఆ తల్లిదండ్రులకి ఆర్థిక భారమే ఆ ఇంట్లో పెనుభూతమైంది. వివరాలిలా ఉన్నాయి. మెట్ పల్లి పట్టణానికి చెందిన కుంచపు లక్ష్మి భాస్కర్ లు కూతురు, కొడుకుతో సాయిరాంకాలనీలో కూలిపని చేస్తూ నివాసం ఉంటున్నారు. కూతురు మౌనిక (22) కు గత సంవత్సరం నుంచి పెళ్లి సంబంధాలు చూడగా ఆర్థిక ఇబ్బందులు వారి వెంటాడాయి.

తల్లిదండ్రులు పడుతున్న బాధను చూడలేక మనస్థాపానికి గురై పెళ్లి జరగడం లేదని గ్రహించి మౌనిక బుధవారం ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి భాస్కర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించమని మెట్ పల్లి ఎస్ఐ శ్యాంరాజ్ తెలిపారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన నువ్వు పరలోకానికి వెళ్ళవంటూ హాస్పిటల్ లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story

Most Viewed