తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : పొన్నాల తిరుపతి

by Sumithra |
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : పొన్నాల తిరుపతి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని పలుగ్రామాల్లో వడగళ్ల వర్షానికి తీవ్రమైన పంట నష్టం జరిగింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దయ్యింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంతవరకు కొనుగోలు మొదలు పెట్టకపోవడంతో ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వడగల్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25,000 నష్ట పరిహారం చెల్లించాలని, తడిసిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేనిపక్షంలో బీజేపీ మండల శాఖ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

నిన్నటి రోజున రైతులకు బీజేపీ రైతులకు మద్దతు తెలుపుతూ ఉంటే అక్రమ కేసులు పెట్టడం ఏంటి అని అన్నారు. పోలీసులు గుర్తుంచుకోవాలి వచ్చేది బీజేపీ ప్రభుత్వం అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. రైతులు ఊరికే రోడ్డెక్కలేదని ఆ మొలకెత్తిన వడ్లు అధికారులకు ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్క అధికారి వచ్చి పంట నష్టం అంచనా వేయలేదని అన్నారు. నిన్న రైతులు నిరసన తెలుపుతూ ఉంటే ఎమ్మార్వో వచ్చి చూసి చూడనట్టు పక్కనుండి వెళ్లిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులే సమాధానం చెప్పలేకపోతే ఎవరు చెప్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేడిశెట్టి బాలయ్య, గుర్రాల రాజిరెడ్డి గడ్డం రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story