- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల రుణ మాఫీ వెంటనే చేయాలి : బీజేపీ కిసాన్ మోర్చ నాయకుల డిమాండ్
దిశ, జగిత్యాల ప్రతినిధి : సకాలంలో రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడుపెల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు. రైతులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. రైతుల నుంచి 13 శాతం వడ్డీ వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఏకకాలంలో రుణమాఫీ చేపట్టి రైతులను ఆదుకోవాలని వినతిపత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, ముద్దం రాము, వరుణ్ కుమార్, నరసింహ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, తిరుపతి, వెంకటేష్, రాములు, లింగారెడ్డి, రాజేష్ రైతులు, నాయకులు పాల్గొన్నారు