దిశ ఎఫెక్ట్​...సింగిల్ విండోలో ఎంక్వైరీ మొదలు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్​...సింగిల్ విండోలో ఎంక్వైరీ మొదలు
X

దిశ,చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంతో అధికారులు చేసిన తప్పిదాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా రావడంతో దిశ పత్రికలో కథనం వచ్చింది. దాంతో సొసైటీకి సంబంధించిన జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సహకార సంఘం జిల్లా అధికారి అసిస్టెంట్ రిజిస్టర్ బి. రాములు సొసైటీలో ఈరోజు విచారణ చేపట్టారు. ఏప్రిల్ ఒకటి 2020 నుండి 2024 వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కానీ 2014 నుండి సొసైటీలో అవకతవకలు జరిగాయని, పూర్తిస్థాయిలో విచారించాలని రైతులు కోరుతున్నారు. ఈ విచారణలో ఇన్చార్జి సీఈవో శ్రీ వర్ధన్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed