శిథిలమైపోతున్న అంగన్వాడీ భవనం

by Aamani |
శిథిలమైపోతున్న అంగన్వాడీ భవనం
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మెట్టు పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల వెంకటేశ్వర పల్లె లో ఓ అంగన్వాడి నూతన భవనం ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే 2014 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడి నిర్మాణం పూర్తి చేసుకున్న అంగన్వాడి భవనం ప్రారంభానికి నోచుకోక శిథిలం అయిపోతున్నది. ఈ పల్లె మీద ఉన్న అంగన్వాడీ పిల్లలను పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్లోని ఓ గదిలో కూర్చో పెడుతున్నారు. రూ.ఆరు లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మాణమైన ఈ అంగన్వాడీ భవనం ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఎలాగూ ఉపయోగంలో లేదు కదా అని ఆ పల్లె ప్రజలు అందులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. లక్షల రూపాయలు పెట్టి నిర్మించిన భవనం ప్రారంభానికి నోచుకోకపోవడం ఏంటో అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed