- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో ధర్నా
దిశ, మంథని: పండుగ వేళ ఆ ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. మంథని పట్టణంలోని బోయిన్ పేటకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న సిద్దు అలియాస్ ఎరవేన ముకేష్(15) అనే బాలుడు శుక్రవారం హొలీ ఆడుకుంటూ వాగులో స్నానం చేసేందుకు స్నేహితులతో వెళ్ళాడు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి మరణించాడు. గత కొద్ది రోజులుగా బొక్కల వాగులో చెక్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా వాగులో ఉన్న ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద గుంతలు తీశారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ తీసిన గుంతలో బాలుడు మరణించాడు. గతంలో సైతం ఇసుక తరలింపు ఆపాలని స్థానికులు ఆందోళన చేపట్టినా అధికారులు స్పందించలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాలుడి మృతదేహంతో మంథని అంబేద్కర్ చౌరస్తాలో టెంట్ వేసి ధర్నా చేపట్టారు. తమ కుమారుడు మృతికి కాంట్రాక్టర్ కారణం అని, 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా వాగులో గుంత తవ్వడంతోనే బాలుడు ఆ గుంతల నీటిలో పడి మరణించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని తొలగించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. స్థానిక నాయకులు కాంట్రాక్టర్ తో చర్చలు జరుపుతున్నారు.